తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి: సీపీ

లాక్​ డౌన్​ మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రజల సహకారం అవసరమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. అంబర్‌పేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ అమలు తీరును ఆయన పరిశీలించారు. జంటనగరాల్లో 80కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.

By

Published : May 25, 2021, 12:51 PM IST

Updated : May 25, 2021, 1:46 PM IST

cp anjanikumar at amberpet
అంబర్​పేట్​లో లాక్​ డౌన్ పరిశీలిస్తున్న సీపీ అంజనీ కుమార్

నగరంలో మూడు రోజులుగా పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. అంబర్‌పేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ అమలు తీరును ఆయన పరిశీలించారు. లాక్​ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జంట నగరాల్లో నిన్న ఒక్క రోజే 5 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబర్‌పేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ అమలు తీరును ఆయన పరిశీలించారు

సీపీ అంజనీ కుమార్

ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదబాబాద్​ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీ వెల్లడించారు. నిన్న ఒక్క రోజే సుమారు 8 వేల వాహనాలు జప్తు చేశామని వెల్లడించారు. అత్యవసర సేవలు మినహా ఎవరూ బయటకు రావద్దని సీపీ అంజనీకుమార్ కోరారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో డోస్ వ్యాక్సినేషన్

Last Updated : May 25, 2021, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details