తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కార్మికుల కష్టాలు తీర్చేదెవరు..? - వలస కార్మికులు

ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్​ విశాఖ నగరంలో వందల కొద్ది ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు నిలిచిపోవటంతో ఇంటి అద్దె చెల్లించడానికి, తినడానికి డబ్బుల్లేక స్వగ్రామాలకు పయనమయ్యారు. కాలినడకన వెళ్తున్న తమకు.. యాజమాన్యం, గుత్తేదారులు ఎలాంటి సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

vsp update
వలస కార్మికుల కష్టాలు తీర్చేదెవరు..?

By

Published : Mar 31, 2020, 11:28 AM IST

రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమ జీవులు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం అమలవుతున్న లాక్‌డౌన్‌ వారి ఉపాధిని కోలుకోలేని దెబ్బతీసింది. మార్చి 22 నుంచి సర్వం బంద్‌ కావటంతో పనిలేక, చేతిలో డబ్బులు లేక వీరంతా అల్లాడిపోతున్నారు. రోజు కూలీలు, హమాలీలు, ముఠా కార్మికులు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు, ఆటోడ్రైవర్లు తదితర వర్గాలకు చెందిన లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రోజుకారోజు ఆదాయంతో నెట్టుకొచ్చే ఈ వర్గాలన్నింటినీ ఇప్పుడు ఒకటో తారీఖు భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఎనిమిది రోజులుగా ఒక్క రూపాయి ఆదాయం లేదు. చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ములు గత వారం రోజుల్లో ఇంటి అవసరాలకు ఖర్చయిపోయాయి. మరికొన్ని రోజుల పాటు ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీన వీరంతా ఇంటి అద్దెలు, వివిధ రకాల బిల్లులు, తీసుకున్న ప్రైవేటు అప్పుల కిస్తీలు, చిరు వ్యాపారులు అయితే వారి దుకాణాల అద్దెలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. వాటికవసరమైన డబ్బులు లేక వీరంతా‘‘అమ్మో ఒకటో తారీఖు’’అని ఆందోళన చెందుతున్నారు.

కష్టాలు.. కన్నీళ్లు

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు సహా రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో పనిచేసే కూలీలు, హమాలీలు, తోపుడు బండ్లపై విక్రయాలు జరిపే వారిలో అత్యధిక శాతం మంది అద్దె ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. వీరు నెలకు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇంటి అద్దె ఒకటో తేదీన చెల్లించాలి. చెల్లించకపోతే తమను ఖాళీ చేయించేస్తారేమోనన్న భయం వీరిని వెంటాడుతోంది.

ఎక్కువ మంది రోజువారీ కూలీల కుటుంబాలు మహిళా స్వయం శక్తి సంఘాల నుంచి లేదా ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుని అవసరాలు గట్టెక్కించుకుంటాయి. ఆ రుణాల చెల్లింపునకు సంబంధించి కిస్తీలు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

విద్యుత్తు బిల్లులు రూ.300-రూ.400 వరకూ కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం చెల్లింపు వీరికి భారమే. మరోపక్క గ్యాస్‌ సిలిండర్​ కోసం దాదాపు రూ.800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆటోడ్రైవర్లు ప్రైవేటు ఫైనాన్స్‌లో ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుంటారు. వాటి రుణ కిస్తీ కింద నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాలి. ఎనిమిది రోజులుగా ఆదాయమే లేకపోవటంతో ఈ కిస్తీలు చెల్లించటం ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చూడండి:కరోనా కాలం.. స్వచ్ఛంద సంస్థల మానవత్వం

ABOUT THE AUTHOR

...view details