తెలంగాణ

telangana

ETV Bharat / state

రాంనగర్​ చేపల మార్కెట్​లో మేమింతే... - కొవిడ్​-19 వ్యాధి నివారణ చర్యలు

సామాజిక దూరంతోనే కరోనా మహమ్మారిని నిర్మూలించొచ్చని సర్వత్రా మారుమోగుతోంది. హైదరాబాద్​ రాంనగర్ చేపల మార్కెట్​లో మాత్రం ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

lock down effect irresponsible people at in Hyderabad dayara fish market
చేపల మార్కెట్టే..!

By

Published : Apr 5, 2020, 8:42 PM IST

Updated : Apr 5, 2020, 11:49 PM IST

కొవిడ్​-19 వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనడానికి హైదరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్ నిదర్శనం. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ఓ వైపు అధికారులు ప్రచారం చేస్తున్నారు. మరో వైపు ప్రజలు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దయారా చేపల మార్కెట్లోని ఓ కౌంటర్ వద్ద పోలీసులు సామాజిక దూరాన్ని పాటించాలన్న సూచన మేరకు కొందరు భౌతిక దూరాన్ని పాటించారు. మిగతా ప్రాంతంలో చేపలు విక్రయించే వ్యాపారస్తులు, అమ్మకందారులు, కొనుగోలుదారులు సామాజిక దూరాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా క్రమశిక్షణ పాటించిన దాఖలాలు కనిపించలేదు.

సామాజిక దూరం అన్నిటికన్నా ప్రధానం...

కౌంటర్ల వద్ద కొనుగోలుదారులు ఇష్టానుసారంగా గుమిగూడారు. ప్రభుత్వం... అధికార యంత్రాంగం ప్రజలకు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా తీరు మార్చుకోకపోవడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ముక్త కంఠంతో వారు కోరుతున్నారు.

చేపల మార్కెట్టే..!

ఇదీ చూడండి:సొంతంగా మాస్కు​ తయారు చేసుకోవటం ఎలా?

Last Updated : Apr 5, 2020, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details