కరోనా భయం వృద్ధ దంపతులను రోడ్డున పడేసింది. విదేశాల నుంచి వచ్చారనే కారణంతో కనీస కనికరం కూడా లేకుండా నిర్ధాక్షణ్యంగా రోడ్డు మీదకు నెట్టేశారు అపార్ట్మెంట్ వాసులు. సికింద్రాబాద్ అల్వాల్ జరిగింది ఈ సంఘటన
సికింద్రాబాద్ అల్వాల్‌లో కరోనా భయంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. అల్వాల్‌లోని చాణక్య షెల్టర్ అపార్ట్ మెంట్ వాసులు.. మూడు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వృద్ధ దంపతులను బయటకు వెళ్ళగొట్టారు. కరోనా వైరస్ అపార్ట్ మెంట్ వాసులకు సోకుతుందన్న అనుమానంతో వృద్ధ దంపతులను బయటకు గెంటేశారు.