నగరంలో పుట్‌పాత్ ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఫలితంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కూల్చివేతను అధికారులు వాయిదా వేశారు.
పుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తుండగా అడ్డుకున్న స్థానికులు - ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులను అడ్డుుకన్న స్థానికులు
నగరంలో ఎక్కడపడితే అక్కడా పుట్‌పాత్‌లను యథేచ్ఛగా అక్రమిస్తున్నారు. దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాంటి ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.

అధికారులతో వాదిస్తున్న స్థానికులు
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో పుట్‌పాత్‌లపై అక్రమంగా ఏర్పాటుచేసిన కట్టడాలను, డబ్బాలను తొలగిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా అధికారుల అనుమతితో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బాలను తొలగించడం సమంజసం కాదని కొందరు మహిళలు వాపోయారు. తమకు కొంత సమయం ఇస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు.