తెలంగాణ

telangana

ETV Bharat / state

'చెరువులు సంరక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు పాల్పడుతోంది' - తెలంగాణ తాజా వార్తలు

Neknampur lake Protest : చెరువులు సంరక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు పాల్పడుతోందని హైదరాబాద్‌లోని నెక్నామ్‌పూర్‌ పరిసర కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారు. మురికికూపంగా ఉన్న చెరువును శుద్ధి చేసి తీర్చిదిద్దుకుంటే.... తటాకం నడిబొడ్డున ఎస్​టీపీ నిర్మించి... మళ్లీ దుర్గంధ కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Neknampur lake issue, locals protest Neknampur lake stp
నెక్నాంపూర్ లేక్​ ఎస్టీపీ వ్యవహారం

By

Published : Feb 8, 2022, 3:32 PM IST

Neknampur lake Protest : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నెక్నాంపూర్‌ చెరువును పరిసర కాలనీల వాసులంతా ఏకతాటిపైకి శుద్ధి చేసుకున్నారు. సొంతఖర్చుతో ఏడాదిపాటు శ్రమించి గుర్రపు డెక్క తీయించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి.. చెరువు శుద్ధికి రూ.22 కోట్లు కేటాయించింది. కానీ సమయం గడుస్తున్న చెరువు ఖాళీ చేయడం తప్ప... సుందరీకరణ పనులు మాత్రం ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు చెరువు మధ్యలో ఎస్టీపీ నిర్మిస్తామనడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కాలనీవాసులకు చెరువు శుద్ధిలో సహకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి... సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వమే కబ్జాదారుగా మారుతోందని విమర్శించారు.

మంచిగా చేయాలంటే లేక్​ను ఎస్టీపీ చేస్తున్నారు. ఇది బాధాకరం. ఎవరో బిల్డర్ చేయడం కాదు. ప్రభుత్వమే ఎస్టీపీ చేస్తే అది చట్టానికి విరుద్ధం. ఇక్కడే కాదు మేము లేక్ కమిటీలు ఎన్నో ఏర్పాటు చేశాం. రియల్ ఎస్టేట్ వాళ్ల మాటలు విని లేక్​ నాశనం చేస్తున్నారు. మీ ప్లాన్ సరిదిద్దుకోవాలి. మీ ఆలోచన సరిదిద్దుకోవాలి.

-కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ

చెరువు మధ్యలో 10 ఎకరాల్లో ఎస్టీపీ నిర్మాణం సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 120 ఎకరాల్లో ఉన్న చెరువు ఇప్పటికే 99 ఎకరాలకు కుంచించుకుపోయిందని వాపోయారు. ఎస్టీపీ నిర్మాణంతో ఎవరికీ మేలు జరగదని సర్కారుకు విన్నవిస్తున్నారు.

మా పైసలతోనే లేక్​ను సాఫ్ చేశాం. తర్వాత మంత్రి కేటీఆర్​ వచ్చి లేక్​ను గవర్నమెంట్ పైసలతోనే సాఫ్ చేస్తామని చెప్పారు. అంత మంచిగ అవుతుంది.. లేక్ మంచిగా అయిందనుకున్న సమయంలో వచ్చి... ఎస్టీపీ పెడుతున్నారు. కబ్జా కాకుండా చూడాల్సిన ప్రభుత్వమే ఎస్టీపీ పెడితే... ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?.

చందన, నెక్నామ్​పూర్ కాలనీ వాసి

ఎస్టీపీ నిర్మాణంతో మళ్లీ పరిసర కాలనీ వాసులు దుర్గంధంలో మునిగిపోతారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. దోమలతో రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు రక్షణ పేరిట మరింత నాశనం చేయవద్దని కోరుతున్నారు. సర్కారు తమ గోడు వినకుంటే ఎంతకైనా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు.

ఎస్టీపీ ఎప్పుడైనా చెరువుకు ఇన్​ఫ్లో లేదా అవుట్ ఫ్లో దగ్గర ఉంటుంది. కానీ రాత్రికి రాత్రే వచ్చి మధ్యలో ఎస్టీపీ కడితే ఎలా. ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారు. ఈ పదెకరాల జాగా ఎవరిది? ఇది ప్రభుత్వానిదా? వాటిని మేమే సంరక్షించుకుంటున్నాం. ఓట్లేసేనాడే మీకు మేం గుర్తుకువస్తామా?

-రాధిక, నెక్నామ్​పూర్ కాలనీ వాసి

ఎస్టీపీ కడతా అంటే మేం వద్దు అనము. ఎస్టీపీ కట్టి వాటర్ శుద్ధిచేయాలి. కానీ లేక్​ను కబ్జా చేసి పెద్ద చెరువును చిన్న చెరువుగా మారుస్తాం అంటే మాత్రం ఊరుకోం. ఉద్యమిస్తాం. మేం లీగల్​గా వెళ్లాలని డిసైడ్ అయ్యాం.

-జితేందర్, నెక్నామ్​పూర్ కాలనీ వాసి

ఇదీ చదవండి:ముదిరిన హిజాబ్​ వివాదం.. కాలేజీలో విద్యార్థుల రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details