హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లోని జవహార్‌నగర్ కమ్యూనిటీ హాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఐసోలేషన్(Isolation) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇళ్ల మధ్య ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల తాము అనేక అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
Isolation: ఐసోలేషన్ కేంద్రంపై స్థానికుల అభ్యంతరం - హైదరాబాద్ తాజా వార్తలు
ఐసోలేషన్(Isolation) కేంద్రం వల్ల తాము అనారోగ్యానికి గురవుతామని హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐసోలేషన్ కేంద్రాన్ని మరో చోటికి తరలించాలని డిమాండ్ చేశారు.
Isolation: ఐసోలేషన్ కేంద్రంపై స్థానికుల అభ్యంతరంIsolation: ఐసోలేషన్ కేంద్రంపై స్థానికుల అభ్యంతరం
ఈ 30 పడకల ఐసోలేషన్(Isolation) కేంద్రాన్ని ప్రారంభించడానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన సమయంలో తమను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఐసోలేషన్ సెంటర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ డీఎంసీ హరికృష్ణ సర్ది చెప్పడంతో వారు వెనక్కి తగ్గారు.
ఇదీ చదవండి:Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి