తెలంగాణ

telangana

ETV Bharat / state

Mlc Counting: కాసేపట్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - స్థానికసంస్థల కోటా

Mlc Counting: స్థానికసంస్థల కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మరో ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరన్నది ఇవాళ తేలిపోనుంది. ఈ నెల పదో తేదీన జరిగిన పోలింగ్​కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కాసేపట్లో జరగనుంది.

Mlc Counting:
తేలిపోనున్న అభ్యర్థుల భవితవ్యం

By

Published : Dec 14, 2021, 5:07 AM IST

Updated : Dec 14, 2021, 7:57 AM IST

MLC Counting: రాష్ట్రంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 10న పోలింగ్ జరగ్గా.. నేడు కౌంటింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Election commission: రాష్ట్రంలో జనవరి నాలుగో తేదీన ఖాళీగా ఉన్న 12 స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రెండు చొప్పున స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఒకటి చొప్పున స్థానాలకు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

MLC elections poling: మిగిలిన ఐదు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆరు స్థానాలకు ఈ నెల పదో తేదీన పోలింగ్ నిర్వహించారు. సగటున 96 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఆరు స్థానాలకు గానూ 26 మంది బరిలో నిలిచారు. ఐదు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఒక్కో చోట ఒక్కో కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు.

Shashank Goyal om counting: ఆదిలాబాద్​లో ఆరు, కరీంనగర్​లో 9, మిగతా చోట్ల ఐదు టేబుళ్లపై లెక్కింపు జరగనుంది. బ్యాలెట్ పత్రాలు అన్నింటినీ మొదట 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత డీటెయిల్డ్ లెక్కింపు చేపడతారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను తొలుత లెక్కిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రక్రియ చేపడతారు. లెక్కింపు సందర్భంగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని.. కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం రిపోర్ట్ చూపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఫలితాల తర్వాత ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు వెళ్ళాలని సీఈఓ చెప్పారు.

Last Updated : Dec 14, 2021, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details