Loan App Harassment Hyderabad : దేశం కాని దేశం నుంచి అక్రమ కార్యకలాపాలు (Cyber crimes in Hyderabad) నిర్వహిస్తూ... ఇందుకోసం భారత్‌లో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని మరీ పలువురిని వేధిస్తున్న రుణయాప్ నిర్వాహకురాలి వ్యవహారం పోలీసుల దాడుల్లో బట్టబయలయింది.. చైనాకు చెందిన జినా అనే మహిళ, హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఐదుగురు సభ్యులను తన సిబ్బందిగా నియమించుకుని హ్యాండీలోన్ అనే పేరుతో మనదేశంలో ఈ తంతు కొనసాగిస్తుంది. రుణం తీసుకోవాలంటే సాధారణంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. (Loan App) దాంతో మొబైల్ కాంటాక్ట్, గ్యాలరీ, వాట్సప్‌లో ఉన్న ఫోటోలు.. యాప్ నిర్వాహకుల చేతిలోకి వెళ్లిపోతాయి. ఇక అప్పటి నుంచి వ్యక్తిగత ఫోటోలు మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తారు.
"ప్రస్తుతం చాలా మంది రుణ యాప్‌లా ద్వారా మోసం చేస్తున్నారు. దాంట్లో ఉన్న ఒక వ్యక్తి మార్ఫింగ్ యాప్ వాడి బాధితులు ఫోటోలు మార్ఫ్ చేసి వారి కాంటాక్ట్ నంబరుకి పంపుతున్నారు. సహజంగా ఎవరైనా ఉన్నట్టుండి ఏదైనా ఆవసరం పడితే లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసి రుణాలు తీసుకుంటున్నారు. అలా చాలా మంది ఈ రుణయాప్ వేధింపులకు గురవుతున్నారు." - చౌహాన్, రాచకొండ సీపీ
China Cyber Gang Arrested in Hyderabad :షేక్ అబ్దుల్ బారీ (Loan App Harassments) అనేరుణయాప్ బాధితుడు, ఈ యాప్ ఉచ్చులో చిక్కుకుని.. తను తీసుకున్న రుణం కంటే.. 20 రెట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అయినాసరే రుణయాప్ నిర్వాహకుల బెదిరింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు .. సాంకేతిక ఆధారాల ద్వారా హర్యానాకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో చైనాకు చెందిన యువతి హస్తం ఉన్నట్లు బయటపడింది. నిందితులు నుంచి.. మూడు లాప్‌టాప్‌లు, ఆరు సెల్‌ఫోన్లు , 11 డెబిట్ కార్డులు, లక్షా 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా యాప్‌ల మాయజాలంలో పడవద్దని రాచకొండ సీపీ చౌహాన్ యువతకు తెలిపారు.