తాజ్‌డెక్కన్ హోటల్లో ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ 7 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముద్దులొలికే చిన్నారులు ట్రెండీ దుస్తులు, నూతన డిజైన్‌లతో అలరించారు. మెుత్తం 80 మంది డిజైనర్ల బ్రాండ్లను చిన్నారులు ర్యాంప్ వాక్, నృత్యాల ద్వారా ప్రదర్శించారు. ఈ వేడుకలో ప్రముఖ డిజైనర్ నిశ్చలారెడ్డి పాల్గొని కిడ్స్‌వేర్ మార్కెట్ 66 వేల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. ఈ రంగంలో డిజైనర్లకు అద్భుత అవకాశాలున్నాయని ఆమె తెలిపారు.
'కిడ్స్ ఫ్యాషన్ వీక్'లో అలరించిన చిన్నారులు - India Kids Fashion Week 7th Edition
హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ 7 ఎడిషన్ కార్యక్రమం జరిగింది. చిన్నారులు ర్యాంప్ వాక్, నృత్యాల ద్వారా 80కి పైగా డిజైనర్ల బ్రాండ్లను ప్రదర్శించారు.
'కిడ్స్ ఫ్యాషన్ వీక్'లో అలరించిన చిన్నారులు