తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో రేపటి నుంచి మద్యం అమ్మకాలు!

లాక్​డౌన్​లో కేంద్రం సడలింపులు ఇచ్చిన మేరకు... మద్యం అమ్మకాలకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగతా ప్రాంతాల్లో సోమవారం మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను మద్యం దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో రేపటి నుంచి మద్యం అమ్మకాలు!
రాష్ట్రంలో రేపటి నుంచి మద్యం అమ్మకాలు!

By

Published : May 3, 2020, 8:55 PM IST

ఏపీలో సోమవారం మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఆబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రం సడలింపులు ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కరోనా కంటైన్మెంట్ క్లస్టర్లల్లో మాత్రం మద్యం అమ్మకాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకు మద్యం దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ సుంకం వేస్తామని, సెస్ విధిస్తామని చెప్పారు.

ఆబ్కారీ శాఖ మార్గదర్శకాలు

  • మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
  • మద్యం కొనేవాళ్లు, అమ్మేవాళ్లు విధిగా మాస్కులు ధరించాలి
  • దుకాణాల్లో విధిగా శానిటైజర్లు ఉండాలి
  • దుకాణం వద్ద ఒకసారి ఐదుగురు కంటే ఎక్కువమంది ఉండకూడదు
  • మద్యం దుకాణాల ముందు 6 అడుగుల దూరం పాటిస్తూ సర్కిళ్లు ఉండాలి
  • దుకాణాల యజమానులు... పోలీసులు, కాపలాదారుల సాయం తీసుకోవాలి

ఇదీ చూడండి:పాసులకు దరఖాస్తు చేసుకోవాలి: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details