లిక్కర్ వ్యాపారానికి అలవాటు పడి... పెద్ద మొత్తంలో లబ్ధి పొందిన వ్యాపారులు... లక్కీడ్రాలో దుకాణాలు దక్కని వారు గుడ్‌విల్ అకౌంటింగ్తో దక్కించుకునేందుకు తెరలేపారు. రాష్ట్రంలో 2017-19 రెండు ఎక్సైజ్ సంవత్సరాల్లో దాదాపు 41వేల కోట్లు విలువైన 9.89 కోట్లు బీరు కేసులు, 6.81 కోట్లు లిక్కర్ కేసుల అమ్మకాలు జరిగాయి. ఇందులో లిక్కర్‌పై 27శాతం, బీర్‌పై 25శాతం లెక్కన దుకాణదారులకు మార్జిన్ ఉంటుంది.
భారీ సంఖ్యలో పోటీ పడుతున్న వ్యాపారులు
పెద్ద ఎత్తున వ్యాపారంలో లాభాలు ఉండడం వల్ల మద్యం దుకాణాల నిర్వహణకు భారీ సంఖ్యలో వ్యాపారులు పోటీ పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసి.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లక్కీడ్రా తీశారు. అదృష్టం ఉన్న వాళ్లకే దుకాణాలు దక్కాయి. గతంలో మద్యం వ్యాపారం చేసిన చాలా మందికి దుకాణాలు దక్కలేదు. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వారిలో ఎక్కువమందికి దుకాణాలు దక్కాయి.
హైదరాబాద్‌లో ఒక్కో దుకాణానికి రూ.80లక్షలు డిమాండ్