కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జంతు వధశాలలపై జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధించింది. హోలీ పండగ రోజున వధశాలలను తెరవకూడదని, రిటైల్ మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలుంటామని హెచ్చరించింది.
వధశాలలు.. మద్యం దుకాణాలు బంద్.. - liquor shops closed news
హోలీ రోజున జంతు వధశాలలు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధించింది. మరోవైపు మద్యం దుకాణాలు మూసివేయాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.
మద్యం దుకాణాలు బంద్..
మద్యం దుకాణాలు..:
హోలీ సందర్భంగా రాచకొండ పరిధిలో ముందస్తు నిబంధనలను విధిస్తూ కమిషనర్ మహేష్‌భగవత్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలను మూసి ఉంచాలన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. రంగులు చల్లి.. ఎవ్వరినీ ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.