రాష్ట్రంలో 43 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియను(Liquor shop tenders in telangana) ఆపేసినట్లు ఆబ్కారీ శాఖ(excise department) అధికారులు తెలిపారు. తక్కువ దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు గానూ 2577 దుకాణాలకు మాత్రమే లాటరీ(lucky draw) నిర్వహించి లైసెన్సుదారులను ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగినట్లు తెలిపారు.
టెండర్ల ప్రక్రియన(telangana liquor tender 2021) ఆగిపోయిన మద్యం దుకాణాల్లో నిర్మల్ 7, వికారాబాద్ 6, ఇంకా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు(liquor tenders) వెల్లడించారు. ఎంపికైన లైసెన్సు దారుల నుంచి ఆరో వంతు లైసెన్స్ ఫీజు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల వారీగా ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్లకు 393 ప్రకారం 756 దుకాణాలు ఆ మూడు వర్గాలకు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన వాటిలో 1,834 దుకాణాలు ఓపెన్ క్యాటగిరిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.