తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. పట్టుబడిన వారిలో వైసీపీ కార్పొరేటర్​ - heavily liquor seized Chittoor district

Liquor: ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి భారీ ఎత్తున అక్రమ మద్యం సరఫరా జరుగుతోంది. నిత్యం పోలీసులు తనిఖీలు చేపడుతున్నా.. ఏదో ఒకచోట అక్రమార్కులు ఈ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో కర్ణాటక రాష్టం నుంచి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా పట్టుబడిన వారిలో వైసీపీ కార్పొరేటర్​ ఉండటం గమనార్హం.

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. పట్టుబడిన వారిలో వైసీపీ కార్పొరేటర్​
భారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. పట్టుబడిన వారిలో వైసీపీ కార్పొరేటర్​

By

Published : Nov 22, 2022, 9:58 PM IST

Liquor Seized: ఏపీలో కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని చిత్తూరు జిల్లాలో గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి కొరియర్ వాహనం ద్వారా తరలిస్తున్న పది వేల టెట్రా ప్యాకెట్లు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా మూడు వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఏడుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. పట్టుబడ్డ మద్యం విలువ సుమారు 10 లక్షల రూపాయలు, వాహనాల విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అయితే అరెస్టైన వారిలో చిత్తూరు 38వ డివిజన్​ వైసీపీ కార్పొరేటర్​ మిట్టూరు ఉన్ని కుమార్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details