Liquor Sales in Telangana: రాష్ట్రంలో డిసెంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మద్యం దుకాణాల్లో తొలిరోజు విక్రయాలు జోరుగా సాగాయి. ఒక్కరోజులోనే ఏకంగా రూ.150 కోట్లకు పైగా మద్యం అమ్ముడు పోయింది. నూతన మద్యం పాలసీలో భాగంగా రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసింది. నవంబర్ 9వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంది. మొత్తం 66,452 దరఖాస్తులు అందినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఒక్కో మద్యం దుకాణానికి 25కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపింది.
Liquor Sales: కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాల జోరు.. తొలిరోజే బోణి ఇన్ని కోట్లా!?
Liquor Sales in Telangana: రాష్ట్రంలో కొత్త మద్యం విధానంలో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారుల తొలిరోజు విక్రయాలు జోరుగా సాగాయి. బుధవారం రోజే రాష్ట్రవ్యాప్తంగా కొత్త దుకాణాల్లో విక్రయాలు ప్రారంభం కాగా.. ఒక్క రోజులోనే ఏకంగా రూ.150 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 6 గంటలకు రూ. 25.48 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదయ్యాయి.
నూతన మద్యం విధానంలో ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు అన్న నిబంధనను తొలగించడంతో పాటు లైసెన్స్ విధానాన్ని సరళీకరణ చేశారు. ఇలా చేయడం వల్ల భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. ఇప్పుడున్న 2,216 దుకాణాలకు కొత్తగా మరో 404 దుకాణాలు అదనంగా ఏర్పాటు అవుతుండడంతో దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. కానీ.. స్పందన పెద్దగా లేకపోవటం వల్ల లక్ష లక్ష్యం కాస్తా.. 66 వేల దగ్గరే ఆగిపోయింది.
ఇదీ చూడండి:TS excise revenue:మద్యం దుకాణాల టెండర్లతో ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం.. ఎంత వచ్చిందంటే..?