Liquor Sales In December 2023 Telangana :తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం ప్రియలు పెద్ద మొత్తంలో మద్యాన్ని తాగేశారు. 2023 డిసెంబర్ నెలలో రూ.4297 కోట్ల విలువైన 43.60 లక్షల కేసులు లిక్కర్, 46.22లక్షల కేసులు బీరు విక్రయాలు జరిగాయి. ఈనెల 28నుంచి 31వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
Telangana Liquor Sales In December 2023 :డిసెంబర్ నెల నుంచే కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చింది. అంటే పాత లైసెన్స్‌దారుల స్థానంలో కొత్తగా మద్యం దుకాణాల లైసెన్స్‌లను దక్కించుకున్న లైసెన్స్‌దారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు డిసెంబర్ ఏడాది చివర నెల కావడం, కొత్త సంవత్సరం ముందు మూడు నాలుగు రోజులు అత్యధికంగా మద్యం అమ్ముడు పోవడం సర్వసాధారణంగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేసుకున్నారు.
మందు బాబులా మజాకా.. మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు కిక్కే కిక్కు
రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లో అధికం :డిసెంబరు నెలలో చివరి నాలుగు రోజుల్లో భారీగా మద్యం అమ్ముడు పోయింది. నాలుగు రోజుల్లో రూ.777 కోట్లు విలువైన 7.12 లక్షల కేసులు లిక్కర్, 7.84లక్షల కేసుల బీరు అమ్ముడు పోయినట్లు ఆబ్కారీశాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే .గత ఏడాది కంటే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లో మాత్రమే అధికంగా అమ్ముడు పోయింది. ఈ రెండు జిల్లాల పరిధిలో 2022లో చివరి నాలుగు రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 204 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా 2023 డిసెంబరులో అదే నాలుగు రోజుల్లో 242 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయింది.