లాక్డౌన్ సమయంలో మారేడుపల్లి న్యూక్లబ్‌లో రూ. 40 లక్షల విలువైన మద్యం బాటిళ్లు విక్రయాలు జరిపారని ముగ్గురు క్లబ్ సభ్యులు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. క్లబ్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాటు వేశారు. అప్పటికే సరకు అమ్మేశారని తెలుసుకున్న ఎక్స్సైజ్ సీఐ నవనిత హుటాహుటిన చేరుకుని క్లబ్‌ను సీజ్ చేశారు.
లాక్డౌన్ వేళ ఆ క్లబ్లో మద్యం అమ్మకాలు - marredpally latest news today
మారేడుపల్లి న్యూక్లబ్‌లో అసలు ఏం జరుగుతోంది..? లాక్డౌన్ కర్ఫ్యూ నేపథ్యంలో క్లబ్ కమిటీ సభ్యులు చాటు మాటుగా బ్లాక్‌లో మద్యాన్ని విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. వారిని సస్పెండ్ చేశామని న్యూక్లబ్ క్రమశిక్షణ కమిటీ ప్రతినిధి రామయ్య నాయుడు స్పష్టం చేశారు.
![లాక్డౌన్ వేళ ఆ క్లబ్లో మద్యం అమ్మకాలు Liquor sales at the new club while locked down in marredpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7260411-604-7260411-1589881555216.jpg)
లాక్డౌన్ వేళ ఆ క్లబ్లో మద్యం అమ్మకాలు
సస్పెండ్‌కు గురైన సభ్యులకు ఎక్సైజ్ పోలీసులు వత్తాసు పలుకుతున్నారని న్యూక్లబ్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు చెబుతున్నారు. తాము క్లబ్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారు తమకు సహకరించడం లేదని చెప్పారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి :పసిడి ధర రూ. 50,100..ఆదిలాబాద్ చరిత్రలో అత్యధికం..!