ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా మద్యపాన నియంత్రణ వేగంగా చేపడుతున్నట్లు మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాలంగా మద్య నియంత్రణకు చేపట్టిన కార్యక్రమాలపై గుంటూరులో ప్రకటన విడుదల చేశారు.
'ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా మద్యపానాన్ని నియంత్రిస్తున్నాం' - ఏపీ మద్యం విక్రయాలు తాజా వార్తలు
ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం వినియోగం తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ తెలిపారు. లాక్డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తగ్గించడం వల్ల కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. దశల వారీగా మద్యం నియంత్రణ చాలా తొందరగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా మద్యపాన నియంత్రణ
లాక్డౌన్ అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల మద్యం వినియోగం 20 శాతం, బీరు 50 శాతం తగ్గిందని తెలిపారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. మద్యం నియంత్రణలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. మద్యం అక్రమాలకు పాల్పడే వారిపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఇకపై తెలుగులోనూ ఫ్లిప్కార్ట్ షాపింగ్