తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా నిల్వచేసిన మద్యం పట్టివేత - Liquor Excise Officers

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ధూల్​పేట్​ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మద్యం పట్టివేత
మద్యం పట్టివేత

By

Published : Apr 24, 2020, 5:43 AM IST

హైదరాబాద్​ మంగళ్​హాట్​లోని బోయిగూడ కమాన్​ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేశారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 2 లక్షలు ఉంటుందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్​ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details