కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపారం చాలా దెబ్బతిందని... అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన ఎక్సైజ్ పన్నులను సర్కారు రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ రెస్టారెంట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా లాక్డౌన్ విధించడం సంతోషమేనని... కాకపోతే ఉదయమే బార్లు తెరవడం సరికాదని తెలిపారు. అందుకే స్వచ్ఛందంగా బార్లను మూసివేస్తామని దామోదర్ గౌడ్ అన్నారు.
బార్లను మూసేస్తాం.. పన్నులను రద్దు చేయండి.. - గ్రేటర్ హైదరాబాద్ రెస్టారెంట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్
గతంలో కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్థిక పరిస్థితిని గుర్తించి బార్ అండ్ రెస్టారెంట్లపై విధించే పన్నులు రద్దు చేసిందని... ఇప్పుడు కూడా తమ పరిస్థితి అర్థం చేసుకొని పన్నులను రద్దు చేయాలని బార్ అండ్ రెస్టారెంట్ల సభ్యులు డిమాండ్ చేశారు.
బార్లను మూసేస్తాం.. పన్నులను రద్దు చేయండి..
ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తమపై విధించే పన్నులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్థిక పరిస్థితిని గుర్తించి బార్ అండ్ రెస్టారెంట్లపై విధించే పన్నులు రద్దు చేసిందని... ఇప్పుడు కూడా రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.