లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సేవలతోపాటు అన్నదాన కార్యక్రమాలను నిరంతరం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ జూలూరి రఘు తెలిపారు.
లయన్స్‌క్లబ్ అన్నదానం.. ఆపద్భాంధవులకు ఆపన్నహస్తం - హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో లయన్స్ క్లబ్ అన్నదానం
సేవ అని పేరు చెప్పగానే ముఖ్యంగా లయన్స్ క్లబ్‌లు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ క్లబ్‌లు సేవా కార్యక్రమాలతోపాటు పలు ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నాయి. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా బుధవారం బాగ్‌లింగంపల్లిలో అన్నదానం ఏర్పాటు చేశారు.
'సేవా కార్యక్రమాలతోపాటు అన్నదానం'
ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో.. అనేక ప్రాంతాల్లో 22 క్లబ్బులు సహకారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాజానికి నిర్మాణాత్మక సేవలు అందించడంలో లైయన్స్ క్లబ్‌లు ముందుంటాయని రఘు వెల్లడించారు.
ఇదీ చూడండి :మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఎదురుచూపు: లక్ష్మణ్