లింగోజిగూడ డివిజన్ వరద ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఉప ఎన్నికల్లో.. ఆయా సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. 5 సంవత్సరాల పాటు డివిజన్లోని ప్రజలకు టాక్స్ ఫ్రీ అనే నినాదంతో ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రచారంలో భాగంగా.. కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
'గెలిపిస్తే.. డివిజన్‌ను వరద ముంపు నుంచి కాపాడుతా' - లింగోజిగూడ ఉప ఎన్నిక
జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్.. ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి.. కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
లింగోజిగూడ ఉప ఎన్నికలు
తనను గెలిపిస్తే డివిజన్‌ను అభివృద్ధి చేస్తానని రాజశేఖర్ హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారంటూ.. వారికి ఏ కష్టం వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. గత ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి ఎన్నికైన భాజపా కార్పొరేటర్ ఆకుల రమేశ్‌గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందడంతో.. డివిజన్‌కు ఈ నెల 30న ఉప ఎన్నిక జరుగుతోంది.
ఇదీ చదవండి:శవాల అడ్డగా కొడంగల్ పట్టణ శివారు.. పోలీసులకు పెనుసవాల్