ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ రాత్రి తొమ్మిది గంటల 9 నిమిషాల సమయంలో దీపాన్ని వెలిగించండం ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. దీపారాధన ఆత్మజ్యోతి స్వరూపమని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని తెలిపారు. కరోనా వ్యాాప్తి నివారణ కోసం జరిపే పోరాటానికి ఈ ఆత్మ విశ్వాసం దోహద పడుతుందన్నారు.
దీప ప్రజ్వలనం బహుళ ప్రయోజన దాయకం - chevella
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి పిలుపు మేరకు ఈ రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దీపాన్ని వెలిగించండంటూ చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఏక కాలంలో దీపారాధన చేస్తే దేశ సమైక్యతను చాటి చెప్పడంతో పాటు దైవానుగ్రహానికి పాత్రులమవుతామని చెప్పారు.
దీప ప్రజ్వలనం బహుళ ప్రయోజన దాయకం
దీపాన్ని వెలిగించడం ఆత్మ విశ్వాసంతో పాటు దేశ సమైక్యతను కూడా చాటుతుందన్నారు. ఒకే సమయంలో 130 కోట్ల మంది దీపాన్ని వెలిగించడమంటే ఈ దేశమంతా కరోనా వ్యాప్తి నిర్మూలనా పోరాటంలో భాగస్వాములుగా ఉన్నామనే అర్థమని చెప్పారు. ఆదివారం సూర్య భగవానునికి ప్రీతి పాత్రమని తెలిపారు. ఈరోజు సాయంకాలం దీపం వెలిగించడం వల్ల అమ్మ వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని చిలుకూరు అర్చకులు రంగరాజన్ తెలిపారు.
TAGGED:
chevella