రాష్ట్రంలో మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం, శనివారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి వర్షాలు - toady weather report
రాష్ట్రంలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి వర్షాలు
తూర్పు గాలులు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి అంతర్గత మహారాష్ట్ర మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ వరకు 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి, గాలి విచ్ఛిన్నత నేడు బలహీన పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి:భైంసా గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులకు కరోనా