వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. బంగాల్, ఉత్తర ఒడిశా తీరాలను ఆనుకుని తీవ్ర అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఉంది. దీని వల్ల ఇవాళ, రేపు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - telangana latest news
రాష్ట్రంలో ఇవాళ, రేపు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడటం వల్ల 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు