రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర చత్తీస్గఢ్ దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 7.6కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశకు వంపు తిరిగి ఉన్నదని పేర్కొంది.
రాష్ట్రంలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం ప్రకటించింది. ఉత్తర చత్తీస్గఢ్ దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది.
రాష్ట్రంలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది. శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఇవీ చూడండి: ఈ-ఆఫీస్కు సంబంధించిన పరికరాల కోసం నిధులు విడుదల