రాష్రంలో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(TS rains) అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(TS weather Report) ప్రకటించింది. ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
TS weather Report: ఉపరితల ఆవర్తన ప్రభావం.. రానున్న మూడురోజులు వర్షాలు - telangana rains
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు(TS rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(TS weather Report) ప్రకటించింది. తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది.
తెలంగాణలో వర్ష సూచన
ఈ రోజు రాష్ట్రంలోకి తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ(TS weather Report) పేర్కొంది. నిన్న కొమరిన్ ప్రదేశం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం(TS weather Report) ఈ రోజు బలహీనపడిందని వెల్లడించింది.
ఇదీ చదవండి:Diwali Precautions: కొవిడ్ బాధితులు టపాసులు కాలుస్తున్నారా? బీకేర్‌ఫుల్!