రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనమే కారణమని అధికారులు వెల్లడించారు.
బీఅలర్ట్: రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రేపు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఉపరితల ద్రోణి ఈరోజు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది.