రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad meteorological department) ప్రకటించింది. గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. ఈరోజు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
TS Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు - rains in telangana for three days
ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad meteorological department) తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న 12గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశలో ప్రయాణిస్తూ రాగల 48గంటల్లో ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈరోజు ఉపరితల ఆవర్తనం కోస్తా, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోందని తెలిపింది.
ఇదీ చదవండి:SRSP WATER FLOW: ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీ వరద.. 32 గేట్లు ఎత్తివేత