నైరుతి రుతుపవనాలు ఇవాళ వాయువ్య, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి విరమించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు ఉపరితల ద్రోణి తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ,ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుంచి 3.1కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొన్నారు.
weather report: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు పలుచోట్ల వర్షాలు - తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు
ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది (imd weather report). దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని(rains in telangana) ప్రకటించింది.
ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి:Weather Report: రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు