బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం తుపాన్‌గా మారనుందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో గురువారం అక్కడక్కడా ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
రాష్ట్రంలో రేపు తేలికపాటి వర్షాలు - Telangana Meteorological Department Latest News
బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం తుపాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో గురువారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
‘బురేవి’గా నామకరణం చేసిన ఈ తుపాను బుధవారం సాయంత్రం లేదా రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలీ సమీపంలో తీరందాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత అది శ్రీలంక మీదుగా ప్రయాణించి ఈ నెల 4న తెల్లవారుజామున దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, పంబన్ మధ్య మరోసారి తీరాన్ని తాకే అవకాశముంది. అప్పటికి కొంత బలహీనపడి గంటకు 65 కి.మీ నుంచి 85 కి.మీ వేగంతో కదలవచ్చని చెబుతున్నారు.
తుపాను ప్రభావంతో ఈ నెల 2, 3 తేదీల్లో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘2-4 తేదీల మధ్య తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 2, 3 తేదీల్లో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూతుకుడి, టెంకసి, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో తీవ్రప్రభావం ఉంటుంది. 3న దక్షిణ కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా జిల్లాల్లో పెనుప్రభావం చూపనుంది.