తెలంగాణ

telangana

ETV Bharat / state

Sajjanar Tweet: ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్‌... - ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Sajjanar Tweet :ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ జన్మదిన కానుక ప్రకటించారు. జీవితకాలం వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా 'లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్‌' ఇచ్చినట్లు ఎండీ సజ్జనార్‌ ట్విటర్​ వేదికగా తెలిపారు.

Sajjanar Tweet
Sajjanar Tweet

By

Published : Dec 9, 2021, 5:31 AM IST

Sajjanar Tweet: ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ జన్మదిన కానుక ప్రకటించారు. జీవితకాలం వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా 'లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్‌' ఇచ్చినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పెద్దకొత్తపల్లి సమీపంలో నవంబర్‌ 30న ఓ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. డిసెంబర్‌ 7న సిద్దిపేట సమీపంలో ఆసిఫాబాద్ డిపో బస్సులో మరో మహిళ కుమార్తెకు జన్మనిచ్చింది.

ఈ ఇద్దరు మహిళలు ఊహించని విధంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేలోగా ఆర్టీసీ సిబ్బంది సాయంతో పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో పుట్టిన ఈ ఇద్దరు పిల్లలకు కానుకగా... ఉచిత జీవితకాల పాస్‌లను మంజూరు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్‌ ట్విటర్​ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:Singareni Trade unions strike: సింగరేణిలో మోగిన కార్మికుల సమ్మె సైరన్‌...

ABOUT THE AUTHOR

...view details