కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ విలువను వాటాలుగా విభజించి స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా లిఫ్టింగ్ చేయాలన్న ప్రతిపాదనను ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. భోజన విరామ సమయంలో హైదరాబాద్లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 74 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎల్ఐసీ ఉద్యోగులు తెలిపారు. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడడానికి తామంతా సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.