మంచి పుస్తకం మంచి స్నేహితుడి వంటిది. శతాబ్దాల నుంచి పఠనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కాలం మారింది, అలవాట్లు మారాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌లు వచ్చాక పుస్తకాన్ని చేతబట్టే వారు కరవయ్యారు. గేమ్స్‌తో జీవితాన్ని డిజిటల్ తెరలకు బలిచేస్తున్నారు. ఇలాంటి ఆటలు... డిజిటల్ స్క్రీన్లు మనిషిని ఒత్తిడికి గురిచేస్తాయి. పుస్తక పఠనంతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో గ్రంథాలయాలకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే కొందరు ఇంటినే లైబ్రరీగా మార్చేస్తున్నారు.
ఇంటి నిండా పుస్తకాలే!:
ఒక్క షఫాలీ అనే కాదు... చాలా మంది పుస్తక ప్రియులు.. ఇంటిని గ్రంథాలయాలుగా మార్చేస్తున్నారు. జీవిత కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇలా ఒకటేమిటీ ఎన్నో రకాల పుస్తకాల దొంతరల మధ్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఓ గదిని లైబ్రరీ కోసం కేటాయించే వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రచయిత్రి ఓల్గా. ఇంటి నిండా పుస్తకాలను నింపడమే కాదు... కొత్తగా కొన్న వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు.
ఇవీ చూడండి: ట్రెండే కాదు... హెయిర్ స్టైలూ మారింది భయ్యా...!