హైదరాబాద్ బేగంపేట్లో వైదిక ఆశ్రమ కన్యాగురుకులంలో ఆర్యసమాజ్.. మహా దినోత్సవసభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. తెలంగాణ విమోచనదినం మతానికి సంబంధించింది కాదని.. మన హక్కులను , భావాలను కాపాడుకోవడమేనని దత్తాత్రేయ అన్నారు. ఆర్యసమాజ్ సంస్థకు ఉన్న 680 ఎకరాల విలువైన స్థలాలను కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని.. వాటిని కాపాడాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హిందూ, భారతీయ సంస్థల్లో సాంఘీక దురాచారాలను పారద్రోలిన సంస్థ ఆర్యసమాజ్ అని కిషన్ రెడ్డి కొనియాడారు. సత్యం, ధర్మం కోసం హిందువులు, భారతీయులను ఒక వేదిక మీదికి తీసుకవచ్చిందని కిషన్ రెడ్డి ప్రశంసించారు.
విమోచనం మతానికి సంబంధించింది కాదు...! - Hyderabad_Dinotsava_Mahasabha
తెలంగాణ విమోచనదినం మతానికి సంబంధించింది కాదని.. మన హక్కులు, భావాలు కాపాడుకోవడమేనని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బేగంపేట్లో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో జరిగిన మహాదినోత్సవ సభకు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
విమోచనం మతానికి సంబంధించింది కాదు...!