తెలంగాణ

telangana

ETV Bharat / state

72 మంది బాలకార్మికులకు విముక్తి

పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో పిల్లలు గాజుల పరిశ్రమలో పనిచేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బాలలను తీసుకొచ్చి వెట్టిచాకిరి చేయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజుల పరిశ్రమలో పని చేస్తున్న 72 మంది బాలకార్మికులను వారి స్వస్థలాలకు పంపించారు.

72 మంది బాలకార్మికులకు విముక్తి

By

Published : Aug 26, 2019, 12:48 PM IST

Updated : Aug 26, 2019, 1:42 PM IST

72 మంది బాలకార్మికులకు విముక్తి

హైదరాబాద్​లోని బాలాపూర్‌ గాజుల తయారీ కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గాజుల తయారీ కేంద్రంలో బాలకార్మికులు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరిశ్రమలో పని చేస్తున్న 72 మంది బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. సీడబ్ల్యూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, బాలాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో బాలకార్మికులను ప్రత్యేక బోగీలో వారి స్వస్థలాలకు తరలించారు.

బాలకార్మికులను పనుల్లో పెట్టుకుని వేధిస్తున్న వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ గాంధీ నారాయణ పేర్కొన్నారు. కలెక్టర్ సమక్షంలో పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్​లో బాలకార్మికులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి : 'ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది'

Last Updated : Aug 26, 2019, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details