తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించండి'

బంజారా సంప్రదాయాలను కించపరిచేలా రూపొందించిన బంజారా సినిమాను నిషేధించాలని జాతీయ బంజారా మిషన్ ఇండియా లంబాడీ హక్కుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది.

LHPS leaders meet sensor board officers
LHPS leaders meet sensor board officers

By

Published : Mar 3, 2020, 11:43 AM IST

లంబాడీల సంస్కృతి సంప్రదాయాలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించే వరకు బంజారా సినిమాను విడుదల చేయవద్దంటూ సెన్సార్ బోర్డుకు జాతీయ బంజారా మిషన్ ఇండియా లంబాడీ హక్కుల పోరాట కమిటీ నాయకులు విన్నవించారు.

హైదరాబాద్ కవాడిగూడలోని కేంద్ర సెన్సార్ బోర్డుకు వచ్చిన ఆ సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోకి అనుమతించేది లేదని మెుదటగా పోలీసులు తెలిపారు. అనంతరం ఓ ప్రతినిధి బృందం కార్యాలయంలోకి వెళ్లి సూపరింటెండెంట్​కు వినతిపత్రం సమర్పించారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించే వరకు సినిమాను విడుదల చేయరాదని వారు కోరారు.

'ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించండి'

ఇవీ చూడండి:3 వేలు దాటిన కరోనా మరణాలు- మరిన్ని దేశాలకు విస్తరణ

ABOUT THE AUTHOR

...view details