ఏపీలోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గోడను ఆనుకుని ఉన్న గ్రామాలు వెంకట్రాది నగర్, వెంకటాపురం. ప్రమాదం జరిగిన ట్యాంక్లు.. గ్రామస్థుల ఇళ్ల నుంచి 50 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ కారణంగానే రసాయన వాయువు తీవత్ర ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇళ్ల గోడల నుంచి ఇంకా రసాయన వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
స్టైరీన్ వాసన వస్తుండటం వల్ల చిన్న పిల్లలను ఇళ్లకు తీసుకురాలేకపోతున్నామని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. తమ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరుతున్నారు.