విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట పోస్టర్లు వెలిశాయి. జి. మాడుగుల మండలం మద్దిగారు గ్రామ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు. ఇందులో మావోయిస్టులు.. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు.
విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖలు - మన్యంలో మావోయిస్టుల లేఖలు
ఏపీలోని విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖలు వెలిశాయి. ఇందులో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. కరోనా ఉద్ధృతి వేళ.. ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు.
మావోయిస్టులు
లేఖలో ఉన్న అంశాలు:
- ఆంధ్రా - ఒడిశా సరిహద్దు రాష్ట్రాల్లో కొవిడ్ ఆస్పత్రుల నిర్మాణం
- ప్రభుత్వ వైద్యులపై పని భారం తగ్గించాలి.
- ప్రైవేటు వైద్య కళాశాలలను స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి.
- వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు తయారీ సంస్థలకు తక్షణం అనుమతులు ఇవ్వాలి.
- ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలి.
- రైతుల రుణలను మాఫీ చేయాలి.
- రైతులకు నిత్యావసర సరకులను పంపిణీ చేయాలి.
- కరోనా వేళ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను రద్దు చేయాలి.
- అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలి.
- ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్‌ను వెంటనే ఆపాలి.
ఇదీ చదవండి:206 రైతు వేదికలు నిర్మించాం: పల్లా రాజేశ్వర్ రెడ్డి