తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూలుపై గవర్నర్​కు లేఖ - suparipalana vedika letter to Governor

ప్రైవేట్ బడుల్లో ఫీజుల వసూలుపై గవర్నర్​కు 'సుపరిపాలన వేదిక' లేఖ రాసింది. విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించాలని కోరింది. దేశంలోనే హైదరాబాద్​లో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని తెలిపింది.

Letter to the Governor on the private schools fee collection
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూలుపై గవర్నర్​కి లేఖ

By

Published : Jul 10, 2020, 7:39 PM IST

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూలుపై గవర్నర్​కు 'సుపరిపాలన వేదిక' లేఖ రాసింది. విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించాలని సూచించింది. జీఓ 46ను ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదని ఆ వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. ప్రైవేట్ బడులపై ప్రభుత్వ ఆజమాయిషీ లోపించిందని చెప్పారు. ఫీజుల నియంత్రణపై తిరుపతి కమిటీ ఇచ్చిన నివేదిక అటకెక్కిందని పేర్కొన్నారు.

ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, బ్యాగులు, ఇతర వస్తువులను అధిక ధరకు విక్రయిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే హైదరాబాద్ మహానగరంలో ఫీజులు ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని అన్నారు. విద్య ఒక వ్యాపారంగా మారిందని చెప్పారు. రాజకీయ నాయకుల పలుకుబడితో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని లేఖలో వివరించారు.

ఇదీ చూడండి :'కేంద్రం నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారో తెలపాలి'

ABOUT THE AUTHOR

...view details