ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల్లో ప్రభుత్వ న్యాయవాదితో పాటు తగిన సిబ్బందిని నియమించాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్కు లేఖ రాశారు. విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
'ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై గవర్నర్కు లేఖ' - కేసుల విచారణపై గవర్నర్కు సుపరిపాలనా వేదిక కార్యదర్శి లేఖ
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ప్రత్యేక న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది, తగిన సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు.
'ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై గవర్నర్కు లేఖ'
రాష్ట్రంలో 64మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు, 10 మంది ఎంపీలపై 133 కేసులు, మాజీ సభ్యులపై 30 కేసులు నమోదయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో కేవలం 73 కేసుల్లో తీర్పు వచ్చినా... ఎవరికీ శిక్ష పడలేదన్నారు. జిల్లాల్లోని న్యాయస్థానాల్లో 509 కేసులు నమోదు కాగా... 245 కేసులను మాత్రమే ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారని వెల్లడించారు. మిగిలిన కేసులను బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ను కోరారు.