తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాంకు ఉద్యోగులకు కరోనా టీకా ఇవ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ - bankers letter to government on corona vaccine

బ్యాంకర్లను కరోనా వారియర్లుగా పరిగణించి తమకు కూడా టీకా ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సేవల్లో తాము కూడా భాగస్వాములమని, ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటంతో బ్యాంకర్లకు కరోనా వ్యాప్తి అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు.

request for vaccine to doctors
టీకా ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల విజ్ఞప్తి

By

Published : Apr 16, 2021, 7:48 PM IST

Updated : Apr 16, 2021, 8:01 PM IST

బ్యాంకర్లను కొవిడ్‌ వారియర్లుగా పరిగణించి వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకర్లు విజ్ఞప్తి చేశారు. వైద్యశాఖ, పోలీసు శాఖల మాదిరిగా తాము కూడా ఖాతాదారులకు నిరంతర సేవలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం వల్ల తమకు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో దశలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.

కేంద్ర ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ అమలవుతోందని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో వైపు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని వెల్లడించింది. బ్యాంకర్ల విషయంలో నిబంధనలు సడలించినట్లయితే వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు బ్యాంకర్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకింగ్‌ సేవల సమయాలను కుదించాలని, వారానికి అయిదు రోజులు పనిదినాలు ఉండేట్లు చూడాలని కోరినట్లు వివరించారు.

ఇదీ చదవండి:'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'

Last Updated : Apr 16, 2021, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details