రాష్ట్రంలో అక్రమ లే అవుట్ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి గడువు పొడిగింపుపై పురపాలక శాఖ దృష్టి సారించింది. గతంలో వివిధ షెడ్యూళ్లలో ఇచ్చిన గడువులు ఇప్పటికే ముగిసిపోయాయి. అన్నింటికీ కలిపి ఒక నెల అదనపు సమయం ఇస్తే పరిష్కరించవచ్చన్నది అంచనా. పురపాలక ఎన్నికల కోడ్ అమలు, అనంతరం కొవిడ్-19, లాక్‌డౌన్ నేపథ్యంలో పురపాలక శాఖ పూర్తిస్థాయిలో ప్రత్యేక విధుల్లో నిమగ్నమవడంతో దరఖాస్తుల పరిష్కారం సాధ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఒక నెల రోజులపాటు గడువు పొడిగించాలని ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు లేఖ రాశారు.
'ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు పొడిగించండి' - ఎల్‌ఆర్‌ఎస్
ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు పొడిగించాలని పురపాలక శాఖ డైరక్టర్... ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు లేఖ రాశారు. కొన్ని కారణాల వల్ల దరఖాస్తూదారులు అవసరమైన సర్టిఫికెట్లు అందించలేకపోయారని... చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
పట్టణ, గ్రామీణ ప్రణాళిక డైరెక్టర్ (డీటీసీపీ) కూడా గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అందులో పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం 20,281 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 17,866 మంది ఆరంభ రుసుం చెల్లించారని వివరించారు. వీటిలో 289 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించగా, 17,577 వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ వల్ల దరఖాస్తుదారులు అవసరమైన సర్టిఫికెట్లు అందించలేకపోవడం, డబ్బులు చెల్లించలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు. గడువు పొడిగిస్తే పాత వాటి పరిష్కారంతో పాటు కొత్తగా 15 వేల దరఖాస్తులు వస్తాయని లేఖలో వివరించారు.
ఇవీ చూడండి:కరోనాపై గెలిచిన వీరులు.. కోలుకున్న బాధితులు వెయ్యి..