తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా జలాల విభజన త్వరగా చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

Central Hydropower Department
కృష్ణా జలాలు, కేంద్ర జలశక్తి మంత్రి

By

Published : Jun 16, 2021, 9:04 PM IST

Updated : Jun 16, 2021, 10:04 PM IST

20:55 June 16

కృష్ణా జలాల విభజన త్వరగా చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్​ను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.  

రెండో అత్యున్నత మండలి సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి హమీ మేరకు పిటిషన్​ను ఉపసంహరించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో నదీజలాల వివాదం సెక్షన్ 3 ప్రకారం వీలైనంత త్వరగా కృష్ణా జలాల విభజన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసి పంపకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే విచారణ కొనసాగుతున్న కృష్ణా నదీజల వివాదాల రెండో ట్రైబ్యునల్​కే తెలంగాణ పిటిషన్​ను నివేదించాలని కోరింది. 

ఇదీ చదవండి:KTR: తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోంది

Last Updated : Jun 16, 2021, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details