'ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలి' - తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణబోర్టు లేఖ
21:00 August 03
'ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలి'
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటివిడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు... తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా టీఎస్ జెన్కో ఇప్పటికే 32.27 టీఎంసీల నీటిని విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్.. బోర్డుకు ఫిర్యాదు చేసింది.
ఇంకా నీరు దిగువకు వదిలితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని ఏపీ పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని తెలిపింది.