సంస్కృతి, కళలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందుత్వ, ఫాసిస్టు దాడులను ఆపాలని.. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన పేరుతో ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజానాట్య మండలి కళాబృందాలు ఒక వేదికపై రావాల్సిన అవసరం ఉందని విమలక్క పిలుపునిచ్చారు. అన్నిరాష్ట్రాల కళాబృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన ప్రదర్శనలు - ప్రజా నాట్య మండలి కళా బృందాలు
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా వివిధసంఘాలు ప్రతిఘటన పేరుతో ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించాయి. దాడులు, హత్యలను అరికట్టాలంటే అన్నిసంఘాలు ఏకతాటిపైకి రావాలని అరుణోదయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు.
హిందు,ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడుదాం