తిరుమల కొండపై వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఈ నెల 31 వరకు కొండపైకి భక్తులకు అనుమతిని తితిదే నిలిపేసింది. కొండపై భక్త సంచారం లేక చిరుతలు, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో చిరుత పులి ఓ జంతువును వేటాడింది. అటవీ సిబ్బంది వాహనాన్ని గమనించి నక్కినక్కీ చూసింది. ఆ తరువాత అక్కడినుంచి వెళ్లిపోయింది. నారాయణగిరి, కల్యాణ వేదిక వద్ద జంతువుల అరుపులు వినిపిస్తున్నట్లు విధుల్లో ఉన్న సిబ్బంది తెలిపారు.
తిరుమల కొండపై చిరుత సంచారం - తిరుమలలో యదేచ్ఛగా తిరుగుతున్న వన్యప్రాణులు
తిరుమల కొండపై భక్తులు లేకపోవడం వల్ల జంతువుల సంచారం ఎక్కువైంది. కరోనా ప్రభావంతో భక్తులకు అనుమతి నిలిపేశారు. వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.
తిరుమల కొండపై చిరుత సంచారం