తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలలో రోడ్డు పక్కనే చిరుత.. - ttd news

తిరుమల కనుమదారిలో చిరుతపులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. రెండో కనుమదారిలో హరణికి సమీపంలో రోడ్డు దాటుతుండగా గమనించారు. చిరుత సంచారంతో కనుమ దారిలో ప్రయాణించే భక్తులను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.

ttd
chita

By

Published : Apr 15, 2021, 7:39 AM IST

తిరుమలలోని కనుమదారిలో నడిరోడ్డుపై చిరుతను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెండో కనుమదారిలో హరణికి సమీపంలో రోడ్డు దాటుతుండగా గమనించారు.

రోడ్డు పక్కన కాలువలో నక్కి ఉన్న చిరుతపులి దృశ్యాలను కారులో ప్రయాణిస్తూ చిత్రీకరించారు. కాలువలో నుంచి చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారంతో కనుమ దారిలో ప్రయాణించే భక్తులను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు.

తిరుమలలో రోడ్డు పక్కనే చిరుత..

ఇదీ చదవండి:రాష్ట్రంలో 8 వారాల్లో 25 రెట్లు పెరిగిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details