జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. జవాబుదారీ తనం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టానికి ఐదు సవరణలు ప్రతిపాదించిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... శాసనసభలో వెల్లడించారు.
4 రకాల కమిటీలు...
12:54 October 13
జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. జవాబుదారీ తనం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టానికి ఐదు సవరణలు ప్రతిపాదించిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... శాసనసభలో వెల్లడించారు.
4 రకాల కమిటీలు...
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు సహా... 10 శాతం గ్రీన్‌బడ్జెట్ 10 ఏళ్లకోసారి రిజర్వేషన్ల మార్పు... 4 రకాల వార్డు వలంటీర్ల కమిటీల ఏర్పాటు... ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదించాలనే సవరణలు మంత్రి ప్రతిపాదించారు. చట్ట సవరణకు ముందే 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి రాష్ట్రంలో మహిళా సాధికారత అంశంలో ముందున్నామని మంత్రి వెల్లడించారు.
గ్రీన్ బడ్జెట్...
పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణల తరహాలోనే పచ్చదనం పెంపు బాధ్యతలు ఇకనుంచి జీహెచ్ఎంసీలో అమలవుతాయన్నారు. గ్రీన్‌బడ్జెట్ ప్రస్తుతం 2.5 శాతమే ఉండగా... అది 10 శాతానికి చేరుతుందని కేటీఆర్ తెలిపారు. ఒక్కో డివిజన్‌లో 4 రకాల వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకోసారి జనగణన చేపడుతోందన్న మంత్రి... అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీలో రెండుసార్లు వరుస రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. దీనివల్ల ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం మరింత పెరిగే అవకాశం కలుగుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.